Best Smart Phones in India 2021 : డిసెంబర్ 2021లో రూ.25వేల లోపు బెస్ట్ మొబైల్ ఫోన్లు ఇవే..!

కొత్త ఏడాది 2022 రాబోతోంది. మార్కెట్లలో కూడా ఇయర్ ఎండ్ సేల్ ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 2021 నెలలో భారత మార్కెట్లో అనేక బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

Best Smart Phones in India 2021 : డిసెంబర్ 2021లో రూ.25వేల లోపు బెస్ట్ మొబైల్ ఫోన్లు ఇవే..!

Best Mobile Phones Under 25000 In India In December 2021 Oneplus Nord Ce, Mi 11 Lite Among Best Buys

Best Smart Phones in India 2021 : మరో వారం రోజుల్లో 2021 ఏడాదికి వీడ్కోలు చెప్పబోతున్నాం.. కొత్త ఏడాది 2022 రాబోతోంది. మార్కెట్లలో కూడా ఇయర్ ఎండ్ సేల్ ప్రారంభమయ్యాయి. భారత మార్కెట్లో డిసెంబర్ 2021 నెలలో అనేక బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకించి రూ.25వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఆకర్షణీయమైన ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. రూ.20వేల నుంచి రూ. 25వేల వరకు బెస్ట్ మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఫ్లాగ్‌షిప్ ఫోన్లు సరసమైన ధరకు అందిస్తున్నాయి. మొబైల్ ఫోన్లలో కేటగిరీల్లో ఎక్కువగా Xiaomi, OnePlus స్మార్ట్ ఫోన్లే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.

Xiaomi Mi 11 Lite, Xiaomi 11 Lite NE 5G వంటి ఫోన్లు రూ. 25,000లకు లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లలో హార్డ్‌వేర్ కన్నా ఇన్-హ్యాండ్ ఫీల్ యూజర్ ఎక్స్ పీరియన్స్ విషయంలో ఎక్కువగా దృష్టి పెట్టాయి. OnePlus Nord CE ప్రతి కేటగిరీలో మెరుగైన సాఫ్ట్‌వేర్ అందిస్తోంది. కొత్త ఫోన్లను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? డిసెంబర్ 2021లో భారత మార్కెట్లో రూ. 25,000 లోపు బెస్ట్ మొబైల్ ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే అందుకు ఇదే సరైన సమయం.. త్వరపడండి.. మిడ్ రేంజ్ ప్రీమియం ఫోన్లపై ఓసారి లుక్కేయండి..

OnePlus Nord CE 5G :

OnePlus Nord CE 5G ఆకర్షణీయమైన ఫీచర్లతో భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ కొనుగోలుపై 5శాతం డబ్బును ఆదా చేసుకోవచ్చు. 1080×2400 పిక్సల్స్.. స్క్రీన్ రిజల్యూషన్‌తో 6.43-అంగుళాల AMOLED డిస్‌ప్లేను అందిస్తోంది. Qualcomm Snapdragon 750G ప్రాసెసర్ రన్ అవుతుంది. అలాగే ఈ ఫోన్ 4500mAh బ్యాటరీని వార్ప్ ఛార్జ్ 30T ప్లస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తోంది. స్మార్ట్‌ఫోన్ f/1.79 ఎపర్చరుతో 64-MP ప్రైమరీ సెన్సార్, 8-MP అల్ట్రా-వైడ్ కెమెరా 2-MP లెన్స్‌ను అందిస్తోంది. 16-MP సెల్ఫీ కెమెరాను అందిస్తోంది. రూ. 25,000 లోపు ఫోన్లలో Nord CE 5G స్మార్ట్ ఫోన్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు.

Mi 11 Lite :

Mi 11 Lite స్మార్ట్ ఫోన్ ధర రూ.25వేల లోపే ఉంది.. ఈ ఫోన్‌లో 5G సపోర్టు లేదు. ఫోన్ డిజైన్, ఫీచర్లు బాగున్నాయి. చాలా తేలికగా ఉంటుంది. చేతిలో పట్టుకునేంతగా సౌకర్యంగా ఉంటుంది. ఈ సెగ్మెంట్‌లోని అత్యుత్తమ డిస్‌ప్లేలలో ఇదొకటిగా చెప్పవచ్చు. ఫోన్ 1080×2400 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌తో 6.55-అంగుళాల AMOLED డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో వచ్చింది. స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732G ప్రాసెసర్‌తో పాటు 6GB, 8GB RAM ఆప్షన్లతో పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4250mAh బ్యాటరీని అందిస్తోంది. 64-MP ప్రైమరీ సెన్సార్, 8-MP అల్ట్రా-వైడ్ 5-MP మాక్రో సెన్సార్‌ను అందిస్తోంది.

Motorola Edge 20 Fusion :

Motorola కంపెనీ గత రెండు ఏళ్లుగా Xiaomi, Realme, OnePlusతో పోటీ పడుతోంది. అందులో భాగంగానే Motorola Edge 20 Fusion ఫోన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ ఫోన్‌ 6.7-అంగుళాల OLED డిస్‌ప్లేతో పాటు 90Hz రిఫ్రెష్ రేట్, సెంటర్డ్ కెమెరా హోల్ పంచ్‌తో వచ్చింది. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్‌‌తో వచ్చింది. అలాగే IP52 రేట్ కలిగి ఉంది. MediaTek Dimensity 800U ప్రాసెసర్‌తో వస్తుంది. 6GB లేదా 8GB RAMతో వచ్చింది. అలాగే ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారంగా MyUX ఇంటర్‌ఫేస్‌తో రన్ అవుతుంది. స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.

iQOO Z3 :

iQOO Z3 2021 స్మార్ట్ ఫోన్.. మిడ్-ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి.. iQOO Z3 స్మార్ట్ ఫోన్ అత్యంత తక్కువ ధరకే లభిస్తోంది. ఇందులో ప్రతి ఒక్క ఫీచర్‌ ఆకర్షణీయంగా ఉంటుంది. iQOO Z3 ఫోన్ 6.58-అంగుళాల ఫుల్-HD+ డిస్‌ప్లే, 4400mAh బ్యాటరీ, 64-MP ప్రైమరీ సెన్సార్, 8-MP వైడ్-యాంగిల్ సెన్సార్, 2-MP మాక్రో సెన్సార్‌తో ఆన్‌బోర్డ్‌లో 16-MP సెల్ఫీ కెమెరా అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లో 6GB, 8GB RAM ఆప్షన్లతో Qualcomm Snapdragon 768G 5G SoC కలిగి ఉంది. iQOO Z3 5G ఫోన్.. మల్టీ టాస్కింగ్ గేమింగ్‌కు పర్‌ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఆకర్షణీయమైన డిజైన్‌తో బ్యాటరీ లైఫ్ కూడా అందిస్తుంది. ఇందులో కెమెరాలు గొప్పగా లేవని చెప్పాలి.

Read Also : January 1 Alert : జనవరి 1 నుంచి RBI కొత్త రూల్స్‌.. ఆన్‌లైన్ పేమెంట్లపై ఈ నిబంధనలు తప్పనిసరి..